ఖాళీ
నా గదిలో మదిలో ఎందుకో ఖాళీ ఖాళీగా
ఎందరో ఎవరెవరో వస్తూ పోతూనే వున్నారు
నేస్తమా
నాలోకి నేను, అంతర్ముఖత్వంలోకి చూస్తున్నా
ఎప్పటికప్పుడు ప్రేమతోనో కవిత్వం తోనో ఖాళీ
పూరిస్తూనేన్నా
ప్రేమ
ప్రేమ చలనశీలి గల గలా పారుతుంది
ఏ ఒడ్డూ,
హద్దూ దాన్ని నిలువరించలేవు
నేస్తమా
నా హృదిలోంచి నీ మదిలోకి, మన
లోంచి విశ్వంలోకి
ప్రేమ పయనిస్తూ పయనిస్తూ గుబాలిస్తున్నది
లయ
ప్రాణ వాయువులా ఇంట్లో కవిత్వమూ, ప్రపంచంలో
దృశ్యమూ
దశాబ్దాలుగా ఇంటికీ ప్రపంచానికీ నడుమ
పరుగెడుతూనే వున్నా
నేస్తమా
నాకు ఇంట్లో విశ్వమూ,
విశ్వంలో ఇల్లూ దర్శనమిచ్చాయి
హృదయం లయ తో నర్తించింది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి