స్వయం కృషి
సూర్యుడి కంటే
ముందే
ఎవరో
పిలిచినట్టనిపిచ్చింది
బాల్కనీ లోకి
వెళ్ళాను
అప్పటి దాకా
ముచ్చట్లా డుతూ
మురిపెంగా వున్న
పక్షుల జంట
రివ్వున ఎగిరి అటూ
ఇటూ తిరిగి
ఎగిరి పోయింది
మనసేక్కడో తడి
తడిగా ...
రెండూ గురిగి బుడ్లు తెచ్చి
బాల్కనీలో
వేలాడకట్టాను
గూడు కోసం
తెల్లవారి ఎవరూ
పిలవకుండానే
సూర్యుడికంటే ముందే
లేచి
కిటికీలోంచి బయటకు
చూశాను
కిల కిల లాడుతూ
పక్షులు
వేలాడగట్టిన కుండల పై
ఊయల వూగు తున్నాయి
మనసంతా హాయి హాయిగా
...
ఆడుతూ ఆడుతూ ఎగిరి
పోయి
ఆ పక్కనే
వేలాడుతున్న
ఎండిన గుమ్మడి
కాయకు
రంధ్రం చేస్తూ తమ
గూడు తామే
నిర్మించుకుంటున్నాయి
పక్షుల మీద కోపం
లేదు
బాధ అంతకంటే లేదు
అవి నా హృదయానికి
మరింత చేరువయ్యాయి
https://aanandvarala.wordpress.com/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి