12, మార్చి 2016, శనివారం

మొలక

ఒంటరితనం లో
నా తల ముడుచుకుని
నాలోకి నా మనసులోకి ఇంకిపోతుంది

కళ్ళేమో
ఒకింత సాత్వికంగా
పరిపరి విధాల లోకాన్ని
వీక్షిస్తూనే వుంటాయి  

మనసేమో
బాధో ఆనందమో
తెలియని అనుభవం లోకి
ఘనమూ ద్రవమూ కాని
అవ్యక్త రూపంలోకి
చీకటీ వెల్తురూ  కాని
ట్రాన్స్పరెంట్ స్థితి లోకి చేరుతుంది

సరిగ్గా అప్పుడే అక్కడే
ఓ విత్తనం మొలకెత్తుతుంది
  
మొలకే మొగ్గై
పూవై వికసిస్తుంది
పరిమళమే కవిత్వమై
విరబూస్తుంది

ఎప్పుడయినా ఎక్కడయినా
ఒంటరితనమే సృజనయి

విశ్వవ్యాప్తమౌవుతుంది 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి