తన్నీర్ తన్నీర్
దాహం
దాహం
అగ్గి
మండుతున్న ఆకాశం
దరి
తేలిన బావులూ
నాలుక
పిడుచ కట్టుక పోగా
గుండెలు
ఆవిసిపోతుంటే
కింద
మీదవుతున్న ప్రాణాల్ని బిగ పట్టుకుని
కుండలు
చంకన బెట్టుకుని
దూర
భారాల నడక
...
ఎవరయినా
మంచి నీళ్ళి వ్వండయ్యా
...
పని
కోసం తండ్లాట
తిండి
కోసం తిప్పలు
కుండ
మంచి నీళ్ళకోసం
కోసెడు కోసెడు దూరం
కుండలతో
కొట్లాట
తన
వాళ్లతోనే తగవు
...
శరీరంలో
బారాణా మందం నీళ్లంటారు
కళ్ళల్లో
ఆఠాణా మందం నీళ్లయినా లేవు
గుడిసెల్లో
సోలానా కరువే
మురికివయినా
ముక్కివయినా
మంచి నీళ్ళకు వెతుక్కునే కాలమొచ్చింది
మంచి నీళ్ళను కొనుక్కునే కాలమొచ్చింది
...
తిండి
కోసం నీడ కోసం
భూమి
కోసమే కాదు
నీళ్ళ
కోసమూ కొట్లాడాల్సిన రోజులొచ్చాయి
...
నెర్రెలు వడ్డ భూమిలాగా
గుక్కెడు
మంచి నీళ్ళ కోసం
చుక్కలు
లెక్కెడుతున్నాం
పానాలు
పోతున్నాయి
పైపులే
ఏస్తరో
పాతాళం
నుంచి తెస్తరో
ఎవడన్నా
మంచి నీళ్ళివండ్రా
(నీళ్ళ
కోసం మైళ్ళు నడిచే అక్కలకూ అమ్మలకూ )
https://aanandvarala.wordpress.com/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి