తెరచాప
చెరువు
లేని వూరు
వెంట్రుకల్లేని
తల లా
గుండె
లేని శరీరం లా
హృదయం
లేని మనిషి లాగా
మారిపోతుంది
చెరువును
కోల్పోయిన వూరు
ఆత్మను
కోల్పోయిన అనుబంధం గానూ
తడి
లేని మనసు లానూ
ఊట
లేని బాయి గానూ మారి
పచ్చదనం
లేని చెట్టు లాగా నిలబడిపోతుంది
అందుకే
చెరువు
ఊరికో లైఫ్ లైన్
. . . .
వూరి
ముచ్చట్లూ
ఉబుసుపోని
కబుర్లూ
ప్రతి
సాయంత్రం
చెరువు
ఒక సమావేశ మందిరం
ఓ
చర్చా వేదిక
చెరువు
ఉపరితలం పైకి విసిరిన
పాలక
రాళ్ళు పుట్టించే
అలల
వలయాలు
ఫ్రేమల్ని
మోసుకొచ్చే కలల సమీరాలు
మా
వూరికి
రైలు
పట్టాలు తెలీదు
అందమైన
పార్కులూ తెలీదు
చెరువుతోనే
దోస్తానా
నీళ్లే
గొప్ప నజరాన
చేరువే
ఒంటరితనాన్ని బద్దలు కొట్టే ‘తెరచాప’
https://aanandvarala.wordpress.com/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి