కల్ ఆజ్ ఔర్ కల్
ఈరోజు
నిన్నటి ప్రతి
బింబం కాదు
రేపటి రోజుకు
ఇవ్వాల్టి రూపం వుండక పోవచ్చు
నిన్నటి కంటే
రేపు సుధీర్ఘ మయిందీ కావచ్చు
గతం గురించీ
పోగొట్టుకున్న దాని
గురించే
మాట్లాడుతూ పోతే
నిన్నటికి రేపటికీ
మధ్య
సన్నటి తెర కరిగి
పోతుంది
గతం లోంచి భవిష్యత్తుకు
వేసే నిచ్చెన
కూలిపోతుంది
నవ్వులు చిందిస్తూ
కాలం నడిచి
వెళ్లిపోతుంది
మిత్రమా
నువ్వూ నేనూ
కాలాన్ని వెనక్కి
తిప్పలేక పోవచ్చు
సముద్రాన్ని ఎండ
గట్టనూ లేక పోవచ్చు
తూఫాన్ని
పిడికిట్లో బిగించ లేక పోవచ్చు
నేటి జీవితాన్ని
రేపటికి పునః ప్రారంభించవచ్చు
పూవులు పూయించ
వచ్చు
https://aanandvarala.wordpress.com/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి