12, మార్చి 2016, శనివారం

బుక్ షెల్ఫ్

బుక్ షెల్ఫ్

మూసి వున్న తలుపుల వెనకాల
వరుసగా పేర్చివున్న
రంగు  రంగుల పుస్తకాలు

ఎన్ని భావాలు
ఎందరు మహా రచయితలు

నిద్ర కరువైన సుధీర్ఘ రాత్రి
కుండపోతగా దుఖం ముంచేసిన క్షణం
ఒంటరితనం మనస్సునీ  శరీరాన్నీ పట్టేసిన వేళ

బుక్ షెల్ఫ్ లోని పుస్తకాల్లో
నన్ను నేను వెతుక్కోవడానికి  
షెల్ఫ్ తలుపులు రెండూ తెరి చాను

పుస్తకాలన్నీ చేతులు  బార్లా జాపి
నన్ను తలోకి లాక్కున్నాయి

పూల దండలోని పువ్వులాగా
పుస్తకాల నడుమ పుస్తకాన్నై
ఒదిగి పోయాను
నా శాశ్వత చిరునామా దొరికింది

https://aanandvarala.wordpress.com/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి