ఆత్మ లోతుల్లో మొలకెత్తాలి
బాధ
సాంధ్రత తెలిసినంతగా
భాష
తెలీదు
గాయం
సలపడం తెలినంతగా
మానడం
తెలీదు
పెదాల
మీద చిరునవ్వు కంటే
చెంపల
పై నీటి
చారికలే
అధికం
తెలిసిందాని
కంటే
తెలియందే
ఎక్కువ
వ్యక్త
పరిచిందానికంటే
అవ్యక్తమే
అధికం
పెదాలు
ఖాళీగానే వున్నాయి
గొంతుక
సవరించ బడే వుంది
మాట
మన రక్త సంబంధీకురాలే
అంతర్
బహిర్ భయాలన్నింటినీ
చిలక్కొయ్యకు
తగలేసి
స్వేఛ్ఛగా
మాట్లాడాలి
స్వచ్చంగా జీవించాలి
చివరి
అంచుకు చేరక ముందే
ఆఖరి
క్షణం
ఎదురు
కాక ముందే
సత్యం
అంతరించక ముందే
ఆత్మ
లోతుల్లో మొలకెత్తాలి
ఎప్పటికప్పుడు
పునరుజ్జీవులం
కావాలి
https://aanandvarala.wordpress.com/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి