ఒకటే
-వారాల ఆనంద్
దుఖం
చీకటి
రెండూ
ఒకటే
దుఖం
లో చీకటి కమ్ముకొస్తుంది
చీకటి
లో దుఖం రెట్టింపవుతుంది
-----------------------------------------------------------------------------------------------
పర్యాయ పదాలు
-వారాల ఆనంద్
నా
కవిత్వంలో
బాధ
దుఖం పరుచుకుని వుంటాయంటున్నారు
బాధ
కవిత్వం
రెండూ
పర్యాయ పదాలు
-------------------------------------------------------------------------------------------------
-తెలుగు వెలుగు
బంధం
-వారాల ఆనంద్
ఎదురు
చూపు నిరాశ కావలపిల్లలు
రెంటి
నడుమా కాలం
సాగీ
సాగీ పుటుక్కున తెగిపోతుంది
ఎదురు
చూపులో
అమితమైన
ఆశ వున్నది
నిరాశ
లో బయట పడని దుఖం వున్నది
రెంటి
తో నాకు
విడదీయరాని
బంధం వున్నది
=
= = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = =
పెన్ను
-వారాల ఆనంద్
కొత్తదే
పెన్ను
దర్జాగా
ఠీవిగా
కాగితం
మీద కదలదే ఎంతసేపటికీ
గీతలూ
రాతలూ మర్చిపోయావా
అడిగాను
కొంచెం కోపంగానే
నడిస్తే
నడిపిస్తే
నడకేమిటి
పరుగులు పెడతాను
పెన్ను
చల్లగా బదులిచ్చింది
ఉలిక్కి
పడ్డాను
నా
కవిత్వాన్ని కాకెత్తుకు పోయిందా
నాలో
జల ఇంకిపోయిండా
నన్ను
నేను పుటం పెట్టుకోవడం
తవ్వి
తలపోసుకోవడం
మొదలు పెట్టాను
==========================================================
నేనూ నా శరీరం
-వారాల ఆనంద్
శరీరం
నేను చెప్పినట్టు
వినడం
మానేసి చాలా కాలమైంది
నేను
లేకుండా శరీరం లేదు
శరీరం
లేకుండా నేను లేను
వెళ్తురు
చీకట్లోకి, చీకటి వెళ్తురు లోకి
కాళ్లీడ్చుకుంటూ
కరిగిపోయినట్టు
నేను
శరీరం లోకి శరీరం నాలోకి
అవిచ్ఛిన్న
సహజీవనం
నిజానికి
నేనూ శరీరం వేర్వేరా ఒకటేనా
ఏది
బొంగరం ఏది తాడు
ఏది
ఇరుసు ఏది కందెన
======================================================
ఖాళీగా లేను
-వారాల ఆనంద్
మాటల్ని
వెతుక్కుంటున్నాను
మనసు
నిండా మాట్లాడ్డం బందై చాలా కాలమైంది
అట్లని
మౌనం పందిరి కింద
నేనేమీ
ఖాళీగా లేను
సముద్రపు
అలల అంచుల్లోని
మీగడ
లాంటి నురగని
దోసిట్లోకి
తీసుకుని ముద్దాడుతున్నాను
ఆకాశం
కాన్వాస్ పై మబ్బులు వేస్తున్న
రంగుల
చిత్రాల్ని ఆస్వాదిస్తున్నాను
చెట్ల
చిగురు టాకుల్లోని స్వచ్ఛతనీ
సున్నితత్వాన్ని
అవలోకిస్తున్నాను
మౌనం
పందిరికింద
నేనేమీ
ఖాళీగా లేను
తప్పి
పోయిన మనిషిని, మనిషి తనాన్ని
వెతుక్కుంటున్నాన
ఆశగా
ఆతృత గా
============================================================
సాకాలి
కాలం నన్ను లాలిస్తుందా మురిపిస్తుందా
కరిగి పోతూ కరిగి పోతూ కదిలిస్తుంది
కలల్ని నాటుకుంటూ నడిచిపోతుంది
నేస్తమా
నేనే నీళ్ళు పోస్తూ సాకాలి
===============================
ఆలంబన
నువ్వు ఎక్కడున్నావ్ కళ్లలోనా కలల్లోనా
ఊహల్లోనా ఊసుల్లోనా
నేస్తమా
నువ్వున్నావనే ధ్యాసే
నా గుండె కదలికకి ఆలాపన
తెరిచివున్న నా కనురెప్పలకి ఆలంబన
================================
రాగాలాపన
జిందగీ సదా సాగే సంగీత ధ్వని
నిన్న నేడు రేపు
గొప్ప లయాత్మక కదలిక
నేస్తమా
కావలసిందల్లా
శ్రుతి తప్పని రాగాలపనే
-వారాల ఆనంద్ 18/11/2015
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి