జుగల్ బంది
తొలి పరిచయం లోనే చిరునవ్వుతో
నా హృది లో విత్తనం నాటావు
నేస్తమా
తిరిగి వచ్చి చూడు అది మొలకెత్తి
స్నేహం ప్రేమల జుగల్ బందీ ని విరబూస్తోంది
=================================================
జీవితం
జీవితం లో ఉల్లాసం ఉదాసీనత
కభీ కుషీ కభీ ఘం , ఏది
ఎక్కువ ఏది తక్కువ
నేస్తమా
ఆనందం కొన్ని క్షణాలే పూల రేకుల్లా
దుఖం కొంత సుధీర్ఘం అంటించిన ఆగర్ బత్తీలా
================================================
చీకటీ వెళ్తురూ
ఎప్పటిలాగే రాత్రి చీకటి తలవంచుకుని పలక
రిస్తున్నది
తెల్లారి వెళ్తురు ఆకాశం మెట్లెక్కి
ఆవరిస్తున్నది
నేస్తమా
చీకటిలో వెళ్తురులో తేడా లేదు కొంచెం ముందూ
వెనుకా
తేడా అంతా మనుషుల్లోనూ మనసుల్లోనూ
-వారాల ఆనంద్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి