7, నవంబర్ 2013, గురువారం

బతుకు
---------------
బతుకు కష్టంగా వుందా
నిరాశ చుట్టూ
ఓ వృత్తాన్ని గీయి
ఆశ దాని చుట్టూ తిరిగి తిరిగి
నిటారుగా
ని ముందు నిలుచుంటుంది
.............................................
ఎక్కడ
---------
దుఖమూ సంతోషమూ
మొదలెక్కడ చివరెక్కడ

చీకటి వెల్తురూ
దారేక్కడ దరెక్కడ

నిద్రా మెలకువా
పోరెక్కడ బతుకక్కడ
.............................................

మిత్రమా
------------------
మనం మాట్లాడుకోవడం మానేసి
చాలా రోజులైంది

పలకరించుకోవడమే మిగిలింది

అవును మరి
మాట్లాడుకోవడానికి
మనసులుండాలి , ఆత్మలు ఉండాలి
ఎదురు ఎదురుగ్గా మనుషులు వుండాలి
........................................................
మలుపు
----------
సాఫీగా గడిచిపోతున్న
జీవితంలో
ఓ పెద్ద కుదుపు

అది మొదటిది కాదు
చివరిది కాదు
మిగిలిన జీవితానికో
పెద్ద మూల మలుపు


1 కామెంట్‌:

  1. గతుకుల రహదారుల్లో కుదుపులు మామూలే..కానీ పెద్ద కుదుపే..జీవితానికి మలుపుగనో..పెద్దమూలమలుపుగనో మిగిలి పోతుందని మంచిగ చెప్పినరు..

    రిప్లయితొలగించండి