మౌనం
================
================
నా మౌనం ఒక మౌనం కాదు
నా మౌనం
వెనకాల దృశ్యాల పరంపర
నా మౌనం ఒక 'ఆంధీ'
అంధీ
గలీలు దాటుకుంటూ
జిందగీని తవ్వుకుంటూ
చౌరంఘి లేన్ లో స్థిరపడింది
అనుకుంటాం కాని
నా
మౌనం స్థిరపడలేదు
క్షణం క్షణం గుండె లబ్ డబ్ ల తోడు గా
శబ్దా శబ్దా ల నడుమ
లోపలి బయటకి పింగ్ పాంగ్ ఆడుతోంది దారి పొడుగునా ధ్వనిస్తున్న
నినాదాల హోరు కావల నిదానమయి నా మౌనం కన్నీరు కారుస్తోంది
ఆరిపోతున్న యవ్వన దీపాల
కొడిగట్టే వెల్తురు కిరణపు వెలుగులో
నా మౌనం మినుకు మినుకు మంటోంది
అనుకుంటాం గాని
నా మౌనం ఇవ్వాల్టిది కాదు
ఇప్పటి దీ కాదు
ఆశపడతాం కాని
మౌనం వీడి
నాలుగు మాటలొస్తే బాగుండునని
అర్థం లేని మాటల కంటే
ఎన్నో భావాల్ని ప్రసారం చేసే
మౌనమే గొప్పది కదా
మౌనమే గొప్ప సంభాషణ కదా
-వారాల ఆనంద్
9440501281
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి