ప్రకృతి-మనుషులు
============================వర్షం ముగిసిన సమయాన
సాయంకాలపు వేళ
కురుస్తున్న సూర్యకిరణాల వెలుగులు,
ప్రకృతి
పసిడి వర్ణం అద్దుకుని
కను చూపు మీరంతా కాంతులీనుతుంది
నది
నవ వసంతాల్ని అనుభూతిస్తుంది
చేమంతి
అప్పుడే విచ్చుకుని
మరింత మురిపెంగా రంగులీనుతుంది
పక్షి
ఆహ్లాదంగా రెక్కలు రెప రెప లాడిస్తుంది
నిజంగానే ప్రకృతి లో
నవ యవ్వనం ప్రతి ఫలిస్తుంది
వేల ఏళ్ళుగా ఇంతే
ప్రకృతి కేమో వయసు తెలీదు
ఈ మనుషులకే
యవ్వనమూ ముసలితనమూ
-వారాల ఆనంద్
మనిషి కూడా పంచభూతాల అంశమే అయినపుడు మనిషి ప్రక్రుతిలాగే వయసు తెలియని వాడే కదా?
రిప్లయితొలగించండి