కాన్చిటి' చౌరాస్తా
అనబడే ఓ తెలంగాణ చౌరస్తా
ఎన్ని పాదాల స్పర్శతో పునితమయిందో
ఎందరు మనుషుల కదలికలతో చైతన్యవంత మయిందో
వాళ్ళు లేకుంటే దానికి అందమేముంది
మనుషులందరూ కదులుతున్న చెట్లు
ఉద్రేక, ఉద్యమ, ఉద్వేగ గాలిని
ఆవాహనం చేసుకున్న వారంతా
విచ్చుకుంటున్న మొగ్గల్లా
విరబూస్తున్న పువ్వుల్లా
ఒకరినొకరు పెనవేసుకుంటూ
కూడలి ఎంత బాగుంటుంది
స్తబ్దత లేదు,జడత్వం లేదు,నిశబ్దం లేదు,
కాంక్షలు మనషులు అవడం
మనుషులు మహోద్రేకంతో మమేకవడం
గొప్ప ప్రేమతో భావాల సంయమనంతో
నాలుగు దిక్కుల్నించి కదుల్తున్న ప్రవాహమవడం
ఎన్నేళ్ళుగానో ఎన్ని'బండి కానీలకు '
చిట్టీలు కట్టిన 'కాన్చీటి' చౌరస్తా
నేడు జీవ మయి హృదయమై
మనుషులందర్నీ సజివుల్ని చేస్తోంది
తాను నిత్య చైతన్య వంత మౌతోంది
-ఆనంద్ వారాల
9440501281
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి