నో మాన్స్ లాండ్
సరిహద్దుకు అవతల
అది ఎవరికీ చెందిన స్థలం కాదు
నన్ను చూడ్డానికి వచ్చావు
గాలి నియంత్రించిన గదిలో
పడి వున్నాను
నిన్ను చూస్తూనే వున్నాను
కూడబలుక్కున్న మాటలు
నీ కళ్ళల్లో ఓ కన్నీటి చార
ఒద్దొద్దు నిశ్చింతగా ఉండొచ్చు
నా పెదాల పై చిరు నవ్వు చార
రక్తం శుభ్రమవుతున్నదంతే
నా మనసూ శుభ్రమవుతున్నది
స్ఫటికంలా అంతా స్వచ్చ మవుతున్నది
అన్ని సరిహద్దులు దాటి వచ్చాం
నువ్వు నేను ఒకే రాడార్ లో వున్నాం
దుఖం వద్దు, వేదన వద్దు
వీడ్కోలు తెలీని సాంగత్యంలో
ఇక నిర్భయంగా కలిసి ఉందాం
-ఆనంద్ వారాల
9440501281
చాల రోజుల తరువాత మీరు మళ్ళి కవితలు రాయాటం చాల సంతోషకరమైన విషయం మరియు మా అందరికి అది స్పూర్తి దాయకం. మీ నుండి మరిన్ని కవితలు రావాలని కోరుకుంటూ .......... మీ సతీష్ బోట్ల .
రిప్లయితొలగించండి