విషాదం
ప్రవాహం నిత్య సత్యం
కదలిక ఒక వాస్తవం
చలన శిలతే జీవితం
కానీ విషాదం ఏమిటంటే
నిరంతర ల్యాబ్ డబ్ ల ప్రవాహం లో
రెంటి మధ్య లయ బద్ధంగా విన బడుతున్న నిశబ్దము
జీవితంలో భాగమే కదా
నిజంగా
నిరంతర కదలికలో ఓ క్షణం
విరామమొస్తే ......
స్థాబ్దతా నిశ్చలనము శూన్యమే మన ముందు నిలబడతాయి
అది నిజంగా ఏమి స్థితి
ఎటూ కదలడానికి వీల్లేదు
ఎటూ మెదలదానికి వీల్లేదు
మైళ్ళకు మైళ్ళు నడవాలనిపిస్టది
ఉరుకులు వేయాలని పిస్తది
అందరిలో కలవాలని పిస్తది
అందరిని అవ్వాలనిపిస్తధి
మనం అనుకున్నట్టుగా చేయలేకపోవడం
మనం అనుకున్నట్టుగా ఉండలేక పోవడం
మరణం కన్నా విషాదం
-ఆనంద్ వారాల
9440501281
బ్రతకటానికి బ్రతికుండటానికి
రిప్లయితొలగించండిజీవితానికి జీవించటానికి మధ్య
తేడ తెలియకుండానే చాలామంది
బ్రతుకు ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న నా లాంటి ఏంతో మందికి
జీవితం అంటే ఏంటో తెలియజేసేలా చాల గొప్పగా చెప్పారు sir.