3, డిసెంబర్ 2013, మంగళవారం

ఎందుకైనా మంచిది
===============

ఎందుకైనా మంచిది
కను రెప్పలు తెరిచే వుంచాలి
ప్రకృతి ఎ అందమైన దృశ్యాన్నో
ని కంటి లో వేసి పోవచ్చు
పోతూ పోతూ ఓ తుంటరి మబ్బు తునక
ఇంద్ర ధనస్సుని సాక్షాత్కరింప చేయొచ్చు

ఎందుకైనా మంచిది
పిడికిలి తెరిచే వుంచాలి
ఎవరైనా చేతిలో చెయ్యేసి
స్నేహ హస్తం కలిపేసి పోవచ్చు
నడుస్తూ నడుస్తూ మనిషనేవాడు
ఓ ఆలింగనం ఇచ్చి పోవచ్చు

ఎందుకైనా మంచిది
హృదయం తెరిచే వుంచాలి
మనసు గల ఏ మనిషో
తలుపు తట్టకుండానే పలకరించి పోవచ్చు
కదుల్తూ కదుల్తూ ఆత్మ గలవాడు
ప్రేమ సంతకం చేసి పోవచ్చు

-వారాల ఆనంద్
aanandvarala.blogspot.in

1 కామెంట్‌:

  1. బాగుంది.మనిషి నిరంతరమూ అన్ని విషయాలలో ఓపెన్ గ( సరి ఐన తెలుగు పదము దొరకడము లెద్దూ )వుంటేనే దేనినైన ఆనదిన్చాగాలుగుతాడు.

    రిప్లయితొలగించండి