20, ఆగస్టు 2014, బుధవారం


లోపలా-బయటా

 ఇప్పుడు ఎవరు మాత్రం
 చేయ గలిగింది ఏముంది 
గది లోపల

మిరుమిట్లు గొలిపే కాంతి లో
ఆకులన్నీ పేర్చి విస్తరి కుట్టినట్టు
గ్లౌజులు తొడుక్కున్న చేతులు
చక చక కదిలి పోతున్నాయి
సైగలే అక్కడి భాష
నిశబ్దానిదే రాజ్యాధికారం
గది బయట
ప్రశాంతమైన కొలనులో రాయి పడినట్టు
అలలు అలలుగా అక్క డొకరు ఇక్కడొకరు
చేతులు కట్టుకుని ఒకరు
జేబుల్లో చేతులు పెట్టుకుని ఒకరు
ఉబికి వస్తున్న కన్నీళ్ళు ఆగని వెక్కిళ్ళు
నిశబ్దాన్ని మంద్రంగా చేదిస్తున్నాయి


 
ఇప్పుడు ఎవరు మాత్రం
 
చేయ గలిగింది ఏముంది
అందరి మనసులో ఏకసూత్రత
మనవాడు బాగుండాలి
మనోడు గెలిచిరావాలి
యోధుడు వాడు గిలేచే తీరుతాడు
రెండు అడుగులు వెనక్కి పడ్డా
మూడు అడుగులు ముందుకు
దూకగల ధీశాలి
వేల సంస్కృతి నుంచి మనవ అనుభవ సారం నుంచి
సమస్త మనవ అభివ్యక్తి నుంచి ఎదిగిన వాడు
ఏకాంతం లోను సమూహం లోను
నిలదొక్కుకున్నవాదు
వాడి స్వప్నాల పరిధి విస్తారం కార్య శాల విశాలం
వాడి ప్రేమ అనంతం
నెల కూలినా
ఫినిక్ష్ పక్షిలా తిరిగి ఎగుర గలినవాడు

వాడు నిజంగా మానవుడు
అవును కవి కూడా
 *************************************************************
కాలం
గతం
పొరలు పొరలుగా 
తెరలు తెరలుగా
పేర్చుకున్న
జ్ఞాపకాల అర

వర్తమానం
క్షణ క్షణం నడక
ఆశల కోసమూ
ఆశయాల కోసమూ
ప్రేమ కోసమూ
బతుక్కోసమూ

భవిష్యత్తు
రూపం దిదూ కునే కళల
మంచు పల్లకి
గమ్యానికి దారి చూపే
దిక్సూచి
నడుస్తున్న కాలం
మనిషికి జీవధాతువు

 

*********************************************************


నాని గాడు

ఇన్నేళ్ళూ
వాడు నాకర్థం కాలే
అవును ఎవరయినా
ఎందుకు అర్థం అవుతారు
మనం ప్రయత్నిస్తే కదా
గుండెల మీద పడుకున్న నాడో
చితికేనల వీలు పట్టుకుని నడిచిన నాడో
జబ్బకు సంచి వేసుకుని
స్కూలుకు వెళ్ళిన నాడూ
ముద్దు మురిపాల ముచేట్లే కదా
ఆనాడు మనకేం అర్థమవుతాడు
ఎదుగుతున్న క్రమంలో
ఇది కావాలని అడగని వాడు
మార్కుల వేటలో
పోటి ప్రపంచంలోకి
ఠీవిగా నడిచి వెళ్ళాడు
వాడి ఆత్మ స్థ్య్ర్యమె తెలిసింది గాని
వాడి లోపలి పదార్థమెదొ అర్థం కాలేదు
సబ్ ఠీక్ హాయ్ మూడ్ లో
తొంగి చూసే ప్రయత్నమూ చేయలేదు

వాడిన్ట్లోకి వాడు
ఏడాదికి రెండు సార్లు  
అతిథిగా మారిపోయాడు
అతిథికి మర్యాదలు చేస్తాం
ఆనంద పెడతాం
తర్వాత బాయ్ చెబుతాం
మనసు లోతుల్ని స్ప్రుశించం కదా
** ** ** ** ** ** **
నాన్నా వచ్చేస్తున్నా
గుండె లోతుల్లో గూడు కట్టు కున్నదేదో
గొంతు దాటేసింది
అప్పుడూ నాకర్హం కాలే
పేస్ బుక్ లోను వాట్స్ అప్ లలోనూ
కారికేచార్లూ అనిమేషన్ క్లిప్పులూ
రావడం మొదలు పెట్టాయి
నా కాళ్ళ ముందు మబ్బు లేవో తోలగుతున్నట్టు
మంచ్ గడ్దేదో కరుగుతున్నట్టు
అంతా స్పస్టా స్పష్టం
ఇన్నేళ్ళూ నాకు తెలీని దేదో
తెలుస్తున్నట్టు
వాడి అంతరంగ మేదో
ఆవిష్కృత మవుతున్నట్టు
వాడి కలలేవో రూపు దిద్దు కుంటున్నట్టు
అంత రిక్షం  నుంచి సృజన
వైపు వాడి ప్రయాణం
సారి రా నాని
నువ్వు అర్థం కాలేదనుకున్నా
కాని నేనే అర్థం చేసుకోలేదు
నా కలలూ ని కలలూ
ప్రోది చేసుకుని
విశ్వం లోకి దూసుకెళ్ళు
నిన్ను అందరూ అర్థం చేసు కుంటారు
( అన్వేష్ కోసం...) 

*************************************************************

 
నిష్టూరం
ఎవరికీ ఎవరి మీదైనా
నిష్టూరం ఎందుకు
ముడుచుకోవడం
విచ్చుకోవడం
పరిమలించడం
వారి వారి జీవ లక్షణం కదా

కలిసి రావడం
కలిసి నడవడం
కలిసి జీవించడం
ఎవరికీ వారు గీసుకున్న
వృత్త పరిధి లోనే  కదా

ఎన్ని దీపాలు వెలిగించి
ఎంతగా వెలుగు వేదజల్లినా
ఎవరికీ వారు
కలిసే వుంటారు విడిగా కనిపిస్తారు
విడి విడిగా వుంటారు
ఒకటిగానే  కనిపిస్తారు
దీవులుగా నిలుచుండి పోతారు

అందుకే ఎవరి కైనా
ఎవరిమీదైనా నిష్టూరం ఎందుకు
ఇక్కడ తప్పొప్పుల ప్రశ్న లేదు
ముందు వెనకాల తావు లేదు
నువ్వో నేనో తేడా లేదు
ప్రేమలూ స్నేహాలూ అభిమానాలూ
పరస్పరం ప్రసారమవుతూనే వుంటాయి
ద్వేషాలూ కోపాలూ అలకలూ
అయిస్టాలూ అన్నీ వుంటాయి
ఎంత చెడ్డా మనుషులం కదా
కాని మనుషులు
దీప స్తంభా లయితే  ఎట్లా 
మినుకు మినుకు వెల్తురు తో
భూమి లో పాతుకు పోతే ఎట్లా
అయినా ఎవరిమీదయినా
నిష్టూరం ఎందుకు
కలిసొచ్చే అంశాల్లో కలిసిపోయి
కాని విషయాల్ని వదిలేసి
చిరు నవ్వులు చిందిస్తూ
ప్రవాహ మయి పోతే సరి
 **************************************************************


విజయ తీరం

మూసినా తెరచినా
కళ్ళు కలల్ని
తోడ్కొని వస్తాయి
కురిసినా ఆరినా
కన్నీళ్లు
మనస్సును కడిగేస్తాయి
వేకువా చీకటి
ఒకదాని వెనక మరోటి
ఏది ముందు వస్తుందో
ఏమి  ఎరుక

నువ్వో నేను
ప్రేమ ఎప్పుడు
మొదలవుతుందో
ఎవరికీ ఎరుక
గెలుపు ఓటమి
ఉచ్వాస నిష్వాశాలయిన చోట
కాలాన్ని కళ్ళల్లో
కాటుకలా పెట్టుకుని
విజయ తీరాలకు
ప్రవహించడమే  
******************************

మనస్సు తేలిక పడింది
దేన్నయినా
కోల్పోవడానికి
దూరం చేసుకోవడానికి
సిద్దంగా లేదు మనసు
ప్రేమని ద్వేషాన్ని
కోపాన్ని ఆప్యాయతని
విచ్చుకున్న   పూలనీ
విరగ కాసిన చెట్టుని చెట్టు బెరడుని
చుక్కల ఆకాశాన్ని హతుకున్న దేన్నయినా సరే
వదులు కోవడానికి సిద్దంగా లేదు మనసు
నేనే అశాశ్వతం కదా
అన్నాను  గుసగుసగా
ఉలిక్కి పడింది మనస్సు
నువ్వు నేను లేకున్నా
నీ కవిత్వం ఉంటుందిగా
తేలిక పడింది మనస్సు
********************************************************************************* 

సహచరి

ఆమె
ఒక భోళా
తనకు తెలిసినదేదో తెలిసినట్టు
తోచిందేదో తోచినట్టు
స్వపర భేదాల్లేవు
ముందు వెనకల్లేవు
కుళ్ళు లేదు కుతంత్రం లేదు

ఆమె మంద్ర నదీ ప్రవాహం కాదు
ఎగిసి దుమికే జలపాతం
మా ఇద్దరి గమనం లో
రహస్యం లేదు
ప్రేమలో మాలిన్యం లేదు
ఆమె స్నేహం లో
వెన్నెల కురుస్తుంది
త్యాగం లో
ఆకాశాన్ని స్పృశిస్తుంది
ఆమెతో జీవితం
బతుకంత లోతయింది
విశ్వమంత విశాలమయింది
*********************************************************************************** 

ఆపరేషన్ ధియేటర్
శీతల గది లో తెల్లటి మంచంమీద
కాళ్ళు బార్లా జాపి
శవాసనం లా వున్నదతను
అకస్మాతుగా
కళ్ళు మిరుమిట్లు గొలిపే
కాంతి ప్రసరించింది
అతని కాళ్ళు చేతులూ
తలా శరీరము అన్నీ
మాట్లాడ టానికి నోల్లుతెరిచాయి
గానం చేయడానికి గొంతు సవరించుకున్నాయి
కాని అన్నీ చలన రహితమయి మూగ వయపోయాయి
అతని మనసొక్కటే మేల్కొని
కాళ్ళ కిటికీ లోంచి మంచు గదిని చూద్దాం మొదలు పెట్టింది
క్షణంలో
ఆదుర్దా ఆందోళన
దుఖమూ సంతోషమూ
అన్నీ సమ్మిళితమై గడ్డ కట్టుకు పోయాయి
కంటి తలుపులు
మూత పడుతుండగా
అతని మనసూ మూగదైపోయింది

శరీరం నిండా
ఏవేవో గాలి పంపులూ
నిటి పంపులూ మత్తు పంపులూ చేరుకున్నాయి
అనంత కాలం తర్వాత
మనసు కూడదీసుకోవడం
ఆరంభించాడు
నిద్రో మెలకువో
చేతనో అచేతనో
స్ప్రుహో నిస్ప్రుహో
క్రమంగా కళ్ళలోకి దృశ్యాలు ప్రవేశించడం మొదలుపెట్టాయి
ఆ క్షణం అతని కున్నది
చూపు విచ్చుకుంటున్న మనసే
అంతట్లోకి శీతల గది సంభాషించడం మొదలు పెట్టింది
మంద్రంగా గానాన్ని ఆరంభించింది
అతని మనసు కు అన్నీ చేరుతున్నాయి
ప్రవాహాలు సముద్రాన్ని చేరినట్టు
కురిసే చినుకులన్ని భూమిని చేరినట్టు
కాలం సమస్త శరీరాన్ని
మేల్కొల్పడం ఆరంభించింది
క్రమంగా గది లో సంభాషణ  విస్తరించింది
ఆతని మనస్సు అంతర్ ముఖత్వం వీడి
రాగాన్ని ఆలాపించడం మొదలు పెట్టింది
ఆ ఆలాపనే
అతన్ని పునరుజ్జీవింప చేస్తుంది
నాట్యం చేయిస్తుంది






ఇమ్మునో  సప్ప్రేస్సర్స్
శరీరం లో ప్రతిఘటించే గుణాన్ని
నియంత్రించేదేదో
రక్త నాళాల్లో సుళ్ళు తిరుగు తోంది
వైరస్ లు బాక్తిరియాలతో సహా
దేన్నీ ప్రతిఘటించలేని
అతనిప్పుడు
ఆకర్ష మంత్రాన్ని పటిస్తున్న
మౌన ముని
ముక్కుకు ముసుగేసుకుని
సకులం ముకులం పెట్టుకుని
జైన థీర్థంక రుడిగా ఓ గది లో అతను
పుస్తకమో  ఐపాడో
లాప్ టాపో సెల్ ఫోనో తగిలించుకుని
తనను తాను తవ్వుంటూ
అర్థం చేసుకుంటూ
నిద్ర కాని దీర్ఘ నిద్రలో వున్నాడు
లోపల గతం వర్తమానం
అనుభవం ఆనందం
సుఖం దుఖం
అన్నీ సుళ్ళు తిరుగుతున్నాయి
ఏకాంతం బహుమతో శిక్షో
తెలుసుకునే యత్నంలో
ఆ మౌన రుషి
ఎన్నేళ్ళు ప్రేమతో చిరునవ్వుతో
అందరిని కలుపుకు పోయిన చలనశీలి
కాళ్ళకు చక్రాలు మనసుకు హద్దులు
మనిషి గెట్లేవి లేకుండా గమనమే తెలిసిన గతిశీలి
నాలుగు గోడల మధ్య నర్తిస్తున్నాడు
అయినా
ప్రతిఘటనా నియంత్రణ
శరీరానికె కాని  ఆలోచనకు కాదు గదా
మనసులో ముంచిన ఆలోచనలకు
పదును పెడుతూ
తనని తాను ఆవిష్కరించు కుంటున్నాడు
ఎంతయినా మనసున్న మనిషి కదా