వారాల ఆనంద్
4, జనవరి 2014, శనివారం
తెలంగాణా
-------------------------
నా ప్రాంతం
సుదీర్ఘ మైన చీకటిలో
బిక్క చచ్చి పోయింది
ఇక్కడ అరవై ఏళ్ళు గా
భూత త ప్రేతాలు గజ్జె కట్టి
విలయ తాండవం చేసాయి
ఆధిపత్యపు అజ మాయిషి కింద
నా ప్రాంతం అనగా దొక్కబడింది
నెలా నీరూ నౌకరీలు
దోపిడీకి గురై
కన్నీరు మున్నీరయింది
అమాయకత్వం అనైక్యతల తోడుగా
నా ప్రాంతం చెల్లా చెదరయింది
అన్ని శక్తుల్ని కూడా దీసుకుని
అవిశ్రాంత పోరులో
రాటు దేలి పోయింది
నేడెమో తెల్ల వారుతోంది
వెల్తురు నెమ్మదిగా
నా ప్రాంతం పై ప్రసరిస్తోంది
చీకటి పొరలు పొరలుగా
తొలగి పోతోంది
ఇవాళ నా ప్రాంతం
స్వేచ్చా సమీరాలు పీలుస్తూ
ఆనంద తీరం వైపు సాగుతోంది
ఉత్తేజం నిండిన ఈ పయనం
రేపటి పునర్ నిర్మాణం దిశగా
మరలాలి
నవ వసంతం విరియాలి
-వారాల ఆనంద్
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)